Availability: In Stock

21 Va Sathabdhi Vyaparam

SKU: manjul0051

225.00

Description

ఆర్ధికవ్యవస్థ ఇక్కడ సమస్య కాదు.

ఆ సమస్య మీరే.

కార్పోరేట్ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్, పెద్దపెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా? లేక, మీ ఆర్ధిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?

జీవితం కఠీనంగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే – దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు? ఆర్ధికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్ధిక భవిష్యత్తుకు భద్రత కలగదు. మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి. మీ ఆర్ధిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది. దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకీ తీసుకోవాలి – ఈనాడే!

మీకో సొంత వ్యాపారం ఉండాలి.

అధిక సంఖ్యాకులకు ఆర్ధికపరంగా ఇది కష్టకాలం కావచ్చు. కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం. దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.

రాబర్ట్రా టి. కియోసాకీ (రచయిత గురించి) :

రాబర్ట్ టి. కియోసాకీ ఒక మల్టిమిలియనేర్ మదుపరి, బిజినెస్ సొంతదారు, విద్యావేత్త, వక్త, అత్యధికంగా అమ్ముడుబోయే రిచ్ డాడ్ పూర్ డాడ్ గ్రంథమాల రచయిత. తన 47వ ఏట పదవీవిరమణ చేశాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహావ్యవస్థాపకుడుగా ఉన్నారు. రిచ్ డాడ్ కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్నిలక్షలమంది జనానికి ఆర్ధికస్వేచ్చ ఎలా పొందాలి అన్న అంశం మీద సలహాలని అందిస్తోంది. రాబర్ట్ 16 పుస్తకాలు రాశారు. 27 కోట్లకీ పైగా అవి అమ్ముడయాయి.

జాన్ ప్లెమింగ్ (రచయిత గురించి) :

జాన్ ప్లెమింగ్ ఒక విజయవంతమైన వాణిజ్యవేత్త, సలహాదారు, వక్త. ప్రస్తుతం డైరెక్టర్ సెల్లింగ్ న్యూస్ అనే పత్రికకు ప్రచురణకర్తగా ఉంటున్నారు. జాన్ ద వన్ కోర్స్ అనే పుస్తకం కూడా రాశారు. ఆర్కిటెక్చర్ సిద్ధాంతాల్ని ఉపయోగిస్తూ విజయవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇది వివరిస్తుంది.

Additional information

author name

Robert T Kiyosaki