Availability: In Stock

Aakhari Poratam – ఆఖరి పోరాటం

SKU: BNAVA004-1-2-2-1-1-1-4-1-2-2-1-2-2-1-1

100.00

‘కృతజ్ఞత అంటే ఏమిటి ? కనుకొలుకుల్లో అశ్రువై నిలిచేది. మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ, మాటలు అందని చోటుకు వెళ్ళిపోయావు. మంచులో తడి వున్న పుష్పాన్ని నా కంటి చివరి బాష్పం చేసి, మేఘరాగం తడి చినుకు పాటచేసి, మౌనరాగం గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా ? నిశ్శబ్దంలో కూడా నిన్ను వినగలిగినవాడే నిజమైన స్నేహితుడట. నిజమేనేమో! ఈ నిశ్శబ్దం మరొకరి కోసం చెదరటానికి ఎంత సమయం పడుతుందో. ఇక నుంచీ నేను మాట్లాడే ప్రతి మాటల వెనుక, చదివే పుస్తకాల పుటల – వాక్యాల, శబ్దాల, అక్షరాల మధ్యంతా లీలగా విషాదమే కనపడుతుందేమో”.

స్పర్శకు ఆలోచన తెగింది

సునాదమాల –

మగవాడు పొరపాటున చెయ్యితాకితే ముందు ఇటుక పొడితో, తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని, నికుంజ్‌ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రినుంచీ ఒక అమ్మాయి అతడితో ఫోన్‌లో రొమాన్స్‌ చేయటం మొదలు పెడుతుంది. పైకి తులసి మొక్క టైపులా కనపడే సునాదమాలే ఈ విధంగా ఫోన్‌ చేసి ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు. ఫోన్‌ చేస్తున్నదెవరు ?

ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితులలో ఒక సి.బి.ఐ. ఆఫీసరును కలుసుకుంటాడు ఆ ఆఫీసర్‌ ఎవరు ?

సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్సుతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ‘ఆఖరిపోరాటం’.

Additional information

Format

Paperback