Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹50.00
‘ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు – ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?”
‘భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.”
”అందుకనే ప్రతీదానికీ కారణం వెతకమంటాను. ప్రతి పనికీ వెనుక కారణం ఉంటుంది. ప్రతి బాధకూ, ప్రతి దు:ఖానికీ ఎక్కడో ఒకచోట కారణం ఉంటుంది. ప్రతి రుగ్మతకీ కారణం వెదకి మందువేసినట్లే మన బాధలు ఏ కారణం వల్ల మొలకెత్తాయో – ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి., అందుకనే ఆలోచించమంటున్నాను’ స్వామీజీ లలితతో అన్న మాటలివి.
ఏమని ఆలోచించాలి? ఏం అర్ధం చేసుకోవాలి? తనే ఇటువంటి పనిచేస్తే అతను అర్ధం చేసుకుంటాడా? ఏ భర్తా ఇటువంటి సందర్భాల్లో భార్యని అర్థం చేసుకున్నట్లు తను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో – పురుషుడు స్త్రీని అర్ధం చేసుకోమని, మరో స్త్రీతో తనని పంచుకొమ్మని భార్యని కోరాడే తప్ప ఇటువంటి కోర్కె ఏ భార్యా భర్తని కోరలేదు.
స్త్రీ అబల! ఎందుకని? పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి – యిలా ఎన్నో కారణాలు చెబుతారు. ప్రతీసారీ స్త్రీని సహించు. సహనం కోల్పోకు, అర్ధం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్ధం చేసుకోవాలి?
స్త్రీ పురుష ప్రకృతులను ఢీకొని చేసి మిమ్ములను ఆలోచింప చేసే నవల. ప్రతి స్త్రీ తప్పక చదవాలి. ఇది మాలతీచందూర్ అపూర్వసృష్టి.
20 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |