Availability: In Stock
Abhayaranyam – అభయారణ్యo
₹120.00
అతుకు
”ఎంతైనా అతుకు అతుకే” మనసులో అనుకోబోయి పైకే అనేసింది సుమతి.
హిందూ పేపర్ని దీక్షగా చదువుతున్న భాస్కర్రావు తలెత్తి సుమతి వంక చూస్తూ ”ఏంటి అన్నావ్” అన్నాడు.
”ఏం లేదండీ. కాంపౌండ్‌వాల్ ఆ మూల మళ్ళీ బీటలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు సిమెంటు చేయించాం. ఎందుకు బీటలిచ్చింది అంటే ‘అబ్బే ఏం లేదండి ఏదో గాలి పగులు’ అంటారు. మళ్ళీ చూడండి అదే చోట ఎట్లా బీటలిచ్చిందో” సుమతి గోడ వంకే పరీక్షగా చూస్తూ అంది.
‘నువ్వన్నది గోడ గురించా’ మనసులో అనుకుని ”ఇంకోసారి సిమెంటు చేయిస్తే సరిపోతుంది. మేస్త్రీకి ఒకసారి రమ్మని కబురు చేద్దాం. అనిక్కి ఓసారి గుర్తుచెయ్” మళ్ళీ పేపర్లో తల దూరుస్తూ అన్నాడు భాస్కర్రావు.
అంతలో అతనికి ఆదివారం ప్రొద్దున్నే అంతసేపు పేపరు చదవటం సుమతికి ఇష్టం ఉండదని గుర్తొచ్చింది. వెంటనే పేపరు మడిచి టీపాయ్ మీద పెట్టి ”ఇవాళేంటి ప్రోగ్రాం? ఎటన్నా వెళ్దామా?” అన్నాడు. ఆదివారం పొద్దున్నే కాఫీ తాగుతూ వరండాలో కూర్చునో, మొక్కల్లో తిరుగుతూనో పిచ్చాపాటీ మాట్లాడడం అంటే సుమతికి ఇష్టం. భాస్కర్రావుకి పేపర్ల పిచ్చి. రోజూ వచ్చే రెండు పేపర్లు కాక ఆదివారం అదనంగా ఇంకో రెండు పేపర్లు కొంటాడు. మొత్తం నాలుగు పేపర్లు ఆదివారం అనుబంధంతో సహా అయిపోయే వరకూ వరండాలో అరుగుమీద బాసింపట్టు వేసుకూర్చుని కదలడు. మధ్యలో రెండు టీలు….
”అభయారణ్యం” కథల సంపుటిలో అతుకు, తోడు, అలక, జీవన చిత్రం, భయం, థర్డ్ ఆప్షన్, డిలీట్, అభయారణ్యం, పెళ్ళంటే, ఓ సిల్లీ కథ, దు:ఖావరణం, హోమం, అద్దం, అదృశ్యం, కళాకారుడు, నాలుగో తరం, పరుసవేది, అమ్మా వాళ్ళ ఇల్లు, సుమిత్ర, రూట్ కెనాల్ అనే 20 కథలు వున్నాయి.
పేజీలు : 140