Availability: In Stock

Abhilasha – అభిలాష

SKU: BNAVA004-1-2-2-1-1-1-4-1-2-2-1-2-2-1-1-1-2

90.00

‘మనిషి మనసంత కుత్సితమైనదీ, అనూహ్యమైనదీ. మరొకటి లేదని నా ఉద్దేశ్యం. పాతిక సంవత్సరాలు క్రిమినల్‌ లాయరుగా పనిచేసి నేను కనుక్కున్న దేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ క్రిమినలే. కొందరు చట్టపరిధిలోకి వస్తారు, కొందరు రారు. నేను రెండో రకానికి చెందినవాణ్ని అని నాకు తెలుసు. అయినా మనసుని అదుపులో పెట్టుకోలేక పోయేవాణ్ణి. పొద్దున్నే దేవుడి పూజ చేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చి పధ్నాలుగేళ్ళ అమ్మాయిని నిద్రలేపటం చిత్రమైన సంతృప్తినిచ్చేది – లేపేముందు మోకాళ్ళమీద గౌనుసర్దటం, ఇంకో రెండు మూడేళ్ళు పోయాక తొలగిన పైట సర్దకుండా లేపటానికి ప్రయత్నించటం అలవాటయింది. నేను కొద్ది కొద్దిగా ఫెటసిస్ట్‌గా మారసాగేను. ఒకరోజు బాత్‌రూమ్‌లో నాకంటిని పుల్లతో పొడిచావుకూడా”.

వింటున్న అర్చన శిలే అయింది. ఇంత నిజాన్ని ఆస్వాదించే శక్తి ఆమెకు లేకపోయింది. ప్రొద్దున్నే పూజగదినుంచి సరాసరి తన గదికి వచ్చి ‘లే అమ్మా లే, ఎనిమిదవుతుంది’ అనితట్టి లేపే మావయ్య తన స్వంతమావయ్య మనసులోనూ, చర్యవెనుక ఇంత ఘాతుకమైన ఆలోచన వుందా ?

ఆమె సిగ్గుతో కుదించుకుపోయింది. ఆయన తనగదిలో ఉన్నప్పుడు స్వంతతండ్రే ఉన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది! అనుక్షణమూ తన కదలికల్నీ ఒంపుల్నీ పరిశీలిస్తూ ఉండేవాడన్నమాట. ఇంత కాలం బైరాగే ఫెటసిస్ట్‌ అనుకుంటూ వచ్చింది. తెలివి తక్కువవాడు కాబట్టి వాడు బైటపడేవాడు. అయినా ఇంత చిన్న విషయం కనుక్కోలేకపోయిందంటే ఏమైనవి తన తెలివితేటలన్నీ ?

సరికొత్త టెక్నిక్‌తో తెలుగు నవలను కొత్తదారికి మళ్ళించి పాఠకలోకాన్ని సస్పెన్సుతో పరవళ్ళు తొక్కించిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ‘అభిలాష’ ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ, చిక్కనవుతున్న సస్పెన్స్‌ ఉరిత్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోకముందే – ఆంధ్రజ్యోతి వారపత్రిక పాఠకుల తాపత్రయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్సీలను దాటించి, సంభ్రమాశ్చార్యానందాలలో పడగొట్టి పరవశింపచేసిన ఫెంటాస్టిక్‌ నవల ‘అభిలాష’.

Additional information

Format

Paperback