Description
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. “అల్పజీవి” రావిశాస్త్రిగారి తొలి నవల. ఇందులో మధ్యతరగతి మందహాసపు వెలుగు నీడలు దోబూచులాడుతూ ఉంటాయి. మనలని నవ్విస్తాయి, కవ్విస్తాయి, అయ్యోపాపం! అనిపిస్తాయి.