Description
గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు.
‘అమరావతి కథలు’ వ్రాసినా, ‘కార్తీక దీపాలు’ వెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.
‘అమరావతి కథల’కు 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. శ్యామ్‌బెనెగల్ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.