Availability: In Stock
Amrutha Kalasam
₹90.00
“విజయలక్ష్మి గారు”!
“ఉ ……… ఎవరు?” తలయెత్తి చూచింది విజయలక్ష్మి. ఎదురుగా వనజ నిలబడి వుంది. వనజకుడా విజయలక్ష్మిలాగే రవీంద్రా ట్యుటోరియల్ కాలేజీలో ట్యూటరుగా పనిచేస్తోంది.
“ఎం చేస్తున్నారు” వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంది.
“ఇప్పుడే ఈ పుస్తకాలు ముందేసుకుని దిద్దటానికి కూర్చున్నాను” అన్నది చేతిలోవున్న ఎఱ్ఱ పెన్సిల్ ప్రక్కన పడేసి.
“జీవితమంటే విసుగు పుట్టిందండి….”
“అబ్బా? అంత విసుగు ఎందుకమ్మా చిట్టితల్లి.”
“ఛి….. ఛి……. మంద……బట్టి పల్లెటూరి రకం” విసుక్కుంది వనజ.
“ఏమిటి వనజ! అసలేం జరిగిందో చెప్పు”.
“మా అత్తగారి జనమంతా ఇంటి నిండా పడి ఏడుస్తున్నారు” అన్నది కసిగా.
-మాద్దిరెడ్డి సులోచన.
20 in stock (can be backordered)