Additional information
Format | Paperback |
---|
₹15.00
ధనస్వామ్య దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటిక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్‌లండన్. అతని జీవితం ఒక అనుభవాల గని. అదే అతణ్ణి రచయితగా చేసింది. రచయిత కావాలనేది అతని జీవితాశయం.
జీవితం మధించి అజరామర కావ్యాలు, కథలు, నవలలు సృజించిన శిల్ప సామ్రాట్టుల్ని ఆపోశన పట్టాడు. మానవ పురోగమన మార్గాలు తెరచిన మార్క్స్ ప్రభృత ప్రవక్తల రచనలు జీర్ణించుకున్నాడు. వికసించిన శాస్త్రీయ దృష్టితో, తన బాల్య కౌమారాలలో చెరగని పదచిహ్నాలకి అద్భుతంగా అక్షరరూపం ఇచ్చాడు. ‘జీవితం, మేధస్సు కలబోసి ప్రపంచాన్ని కుదిపివేసిన యాభై సంపుటాలు రాసి’ నలభయ్యో యేట జీవితం నుంచి నిష్క్రమించాడు.
తెలుగు పాఠలోకానికి చిరపరిచితమైంది జాక్ లండన్ ‘ఉక్కుపాదం’ నవల, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఎగరేసిన తిరుగుబాటు జండాగా ప్రజల మనోవీధుల్లో కలకాలం రెపరెపలాడుతూనే ఉంటుంది.
లక్షల మెదళ్ళను కదలించిన జాక్‌లండన్ కలం నుంచీ వెలువడ్డది ‘మెక్సికన్’ అనే ఈ కథ. ఆద్యంతం ఉత్కంఠతో చదివించే, విప్లవోద్రేకంతో కదిలించే ఈ కథ జాక్‌లండన్ రాసిన కథలన్నింట్లో గణగణమండే కాగడా లాంటిది.