Additional information
Format | Paperback |
---|
₹100.00
13 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల
యండమూరి వీరేంద్రనాథ్
కోనసీమ కొబ్బరాకు – గలగలా గోదావరి …. ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు.
ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది.
అది ప్రేమా ? ఆకర్షణా ? స్పందనా ? సెక్సా?
ఆ బంధం నిర్వచనం ఏమిటి ? అమ్మాయిలయితే స్వీట్ సిక్స్‌టీన్ అంటారు. మరి అబ్బాయిలకి స్వీట్ ఎయిటీనా ?
నవల 2054 ఎ.డిలో మొదలవుతుంది. మళ్ళీ అక్కడి నుండి వందేళ్ళు వెనక్కు మళ్ళుతుంది. అబార్షన్‌కు తండ్రిని డబ్బడిగే పెళ్ళికాని కూతురు దగ్గర్నుంచి, అనిర్వచనీయ ఆత్మీయబంధం పెనవేసుకున్న సోమయాజీ మందాకినిల వరకూ ఎన్నో విలక్షణ పాత్రలు తారసిల్లే అపురూపమైన నవల ‘ఆనందో బ్రహ్మ’. ఫ్యూచరాలజీకి పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్ అల్లిన లలిత పదాల సన్నజాజి పందిరి ‘ఆనందోబ్రహ్మ’.