Additional information
select-format | Paperback |
---|
₹220.00
సృష్టిలోని అలౌకికమైన తీయదనాలలో ముఖ్యమైంది స్నేహం. దానిని అనుభవించ గలిగినవారికే దాని ప్రాముఖ్యత అర్ధమవుతుంది.
అది ఇద్దరు మగవాళ్ళ మధ్య కావచ్చు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు. లేక అరుదుగా ఓ మగ, ఓ ఆడ మధ్య కావచ్చు. అంతేకాదు వివాహితులైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు. స్నేహం విషయంలో వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛికం అవుతుంది.
శృంగారపరమయిన భావాలకి లోను కాకుండా స్నేహం చేయగలగడం ఆడ, మగలకి సాధ్యం కాదా ? ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవి చూడగలగడం అనుభవం లోకిరాకూడదా ?
పై బెర్త్‌లోంచి వినపడుతున్న భర్త గురక. రైలు ఏదో స్టేషనులో ఆగింది. బయట ఆరి వెలుగుతూ ఎగిరే మిణుగురు పురుగులు. శాంతి చేతిని బయటి పెట్టి ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకుని తన జుట్టు మీద ఉంచుకోసాగింది. చిన్నప్పుడు రాత్రిళ్ళు దొడ్లొకి వెళ్ళి మిణుగురు పురుగులని గ్లాసులో పట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది శాంతికి.
సిగ్నల్ ఇవ్వడంతో రైలు మళ్ళీ బయలుదేరింది. శాంతి తన పెట్టె అందులోంచి తనడైరీ తీసి, అందులోంచి రెండు తెల్లకాగితాలని తీసి ఓ ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.
‘డియర్ ప్రియతమ్,
మీరు ఉత్తరం రాసి నాకు మీ చిరునామా తెలియగానే దానికి జవాబు రాయబోయే ముందు ఈలెటర్ మీకు పోస్ట్ చేస్తాను……..
తన భర్త ‘ఇంక పడుకోరాదు’ అని పై బెర్త్‌లోంచి అరిచేదాకా శాంతి కిటికీకి ఆనుకుని కూర్చుని, కిటికిలోంచి పడే వెన్నెల వెలుగులో ప్రియతమ్‌కి తన మొదటి ఉత్తరం రాస్తూనే ఉంది – అంటూ ముగించారు శ్రీమల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తమ అందమైన జీవితం నవలని.
స్త్రీ పురుషుల మధ్య సెక్స్‌కి దారితీయని సుగంధ స్నేహసుధ సాధ్యమని నిరూపించే నవల ‘అందమైన జీవితం’.
20 in stock (can be backordered)