Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹50.00
అంధకారంలో …. రంగనాయకమ్మ నవల ………. ‘రాజేశ్వరి’ని చాలమంది చూసే ఉంటారు. చూస్తూనే ఉంటారు. జనసమ్మర్దం లేని ఏ రోడ్డువారో, ఏ చెట్టుకిందో, సంతోషమూ, విచారమూ ఏదీ వ్యక్తం చెయ్యదు. ఊరికే నించుని వుంటుంది. కొంచెం అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. ఎవరన్నా వెకిలి నవ్వు నవ్వి పోకిరీమాట విసిరితే ఆశపడి దగ్గరికొస్తుంది. నిరాశ కలిగితే నెమ్మదిగా కదిలి నిశ్శబ్దంగా నడుస్తూ మన దృష్టికి దూరమౌతుంది.
శరీరాన్ని అమ్ముకోకపోతే బతకలేని స్థితి స్త్రీకి కలగటం, అనాగరికతకీ, సంఘ పతనానికీ నిదర్శనం. ఈ నవలలో రాధ-రాజేశ్వరి-మహలక్ష్మమ్మ-సుందరమ్మ వంటి పాత్రలమీద మనకు సానుభూతి కలుగుతుంది. అదొక్కటే చాలదు. అట్లాంటి పరిస్థితులు సంఘంలో ఎందుకు వున్నాయో కారణాలు గ్రహించాలి. మనిషి నవ్వుకీ, నిట్టూర్పుకు కూడా సంఘంతో సంబంధం ఉంది. ఏ నిర్మల హృదయాల ప్రేమ విఫలతకైనా, ఏ నిస్సహాయుల మానసికక్షోభకైనా ఏ నిరుపేదల కష్టపరంపరకైనా సంఘంతో సంబంధం ఉంది.
మనం మన బిడ్డలకు ఉగ్గుపాలతో నూరిపోసే ధర్మ కషాయాలూ, తల్లిదండ్రుల వికార సంసార శోభలూ, పాఠశాలల్లో పిల్లల చైతన్యాన్ని వేళ్ళతో సహా ఊడబీకే విద్యావిధానాలూ, బయట సమాజ ఆరోగ్య ప్రభావాలూ-ఇన్ని కలసి జీవితం తయారవుతున్నప్పుడు, వ్యక్తుల్నీ, వారి స్వభావాల్నీ, వారి చేష్టల్నీ, నిందించీ, విమర్శించీ సాధించేదేమీ ఉండదు. ఏ సుఖశాంతులకోసమైతే సంఘధర్మాలకు కట్టుబడాలో, ఆ సుఖశాంతులకోసమే అవసరమైతే సంఘధిక్కారమూ చేయాలి. నిజమైన మేలుచేసే వారెప్పుడూ దాన్ని ప్రశ్నించి ధిక్కరించేవారే.
ఈ నవల పూర్తిగా చదివిన తర్వాత చిన్న రాజేశ్వరి అయినా మంచి జీవితం జీవిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఆ చిన్న రాజేశ్వరి మంచి జీవితం జీవించాలంటే, మనుషుల మెదళ్ళూ, వ్యవస్థలూ, ప్రభుత్వాలూ, ఇజాలూ, అన్నీ కదిలే సమస్య ఇది. అర్ధవంతమైన ‘బాపు’ ముఖచిత్రంతో, ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మగారు రాసిన నవలకిది ఐదవ ముద్రణ.
20 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |