Availability: In Stock

Asadhyam Nunchi Sadhyaniki

SKU: NEELKA001

300.00

6 in stock

Description

                                                                                     విజయ రహస్యం

జయానికీ, అపజయానికీ మధ్యతేడా ఎంత స్వల్పంగా ఉంటుందంటే మనం ఆ రెంటిమధ్య గీయబడ్డ రేఖని దాటుతున్నప్పుడు కనీసం గమనించనైనా గమనించలేం. అప్పుడప్పుడు ఆ రేఖమీదే ఉండి కూడా మన ఉనికిని గుర్తించలేం.

ఒకసారి ప్రపంచ ప్రఖ్యాత న్యూజీలాండ్ క్రికెట్ ఆల్రౌండర్ రిచర్డ్ హాడ్లీని ఒకరు ఇలా ప్రశ్నించారు. ‘మీరు బౌల్ చేసిన ప్రతీసారి ప్రతీ ఇన్నింగ్స్లోనూ ఐదుకు పైగా వికెట్లు ఎలా సాధించగలుగుతున్నారు?’

హాడ్లీ కాస్సేపు మౌనం వహించి అటుపై ఇలా సమాధానం చెప్పాడు, ‘మ్యాచ్ జరగడానికి ముందురోజు వికెట్లన్నీ నేనే పడగొడుతున్నట్టు ఊహించుకుంటాను. మ్యాచ్ రోజున, బౌల్ చేస్తున్నప్పుడు కూడా ఇలానే ఊహించుకుంటాను. సరిగ్గా ఊహించుకొన్నదే జరుగుతుంది. బాల్ వేస్తాను. వికెట్లన్నీ చెల్లాచెదురైపోతాయి!’

ప్రఖ్యాత పోల్వాల్ట్ జంపర్ సెర్గీ బుబ్కాని ఒక పత్రికా విలేఖరి ఇలా అడిగాడు, ‘సర్! మీరు జంప్డ్చేసిన ప్రతీసారీ, క్రిందటిసారికంటే ఎక్కువ ఎత్తుకు ఎలా ఎగురగలుగుతున్నారు? ఎగిరి ఎగిరి మీరికార్డుల్ని మీరే ఎలా అధిగమించగలుగుతున్నారు?’

దానికి బుబ్కా సమాధానం: ‘ఇది చాలా చిన్న విషయం. నా మనసు ముందు జంప్ చేస్తుంది. నా శరీరం మనసుని వెంబడిస్తుందంతే. ‘

అందుకేనేమో మోటివేషనల్ స్పీకర్ నెపోలియన్ హిల్ చెప్పిన మాటలు నా చెవుల్లో ఎప్పుడూ గింగుర్లాడుతూ ఉంటాయి: ‘ఈ జగత్తులో……………….

Additional information

select-format

Paperback