Availability: In Stock

Bhagavatam Lo Chinna Kathalu

SKU: NAV0374-1

125.00

6 in stock

Description

భాగవతమైన భాగవతం ఆధ్యాత్మిక లోతులను కలిగిన ఆనంద రసమయసాగరం. భవరోగ నివారణకు దివ్య ఔషధం. ఇటువంటి భాగవతాన్ని చదువరులకు ఆసక్తి కలిగించే విధంగా చిన్న కథల రూపంలో అందించేందుకు ప్రయత్నించిన శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి కృషి అభినందనీయమైనది. సరళమైన శైలిలో సర్వజనరంజకంగా ఆసక్తికరంగా ఉండేందుకు ఆయన ప్రయత్నం ప్రశ౦సనీయం.

– స్వామి జ్ఞానదానంద

ప్రయాగ రామకృష్ణ గారి భాగవతం లో చిన్న కథలలో అటు వేదాంతం, తాత్వికధోరణి, ఇటు కవిత్వ అభివ్యక్తీకరణ చెట్టాపట్టాలేసుకుని చిందులు తొక్కాయి.

ఈ భాగవతం లోని చిన్నకథలు, నవ్య వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమై ప్రజామోదాన్ని పొందగలగటానికి భాగవతంలోని కథల నిత్యమైన సత్యమైన ఆకర్షణ ఒక ఎత్తయితే – రామకృష్ణగారి కథాకథన శైలీ మాధుర్యం మరో బలవత్తరమైన ఆకర్షణ అయి నిలిచింది.

– దత్తప్రసాద్ పరమాత్ముని

Additional information

select-format

Paperback

Author

Prayaga Ramakrishna