Additional information
Format | Paperback |
---|
₹90.00
ఏడో నెలలో 12 పౌండ్ల బేబీ – చాలా ఆరోగ్యంగా – మామూలు ప్రసవంలా పుట్టటం దాదాపు అ…. సం….భ…వం…. హఠాత్తుగా ఆగిపోయి, మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్న వాడిలా ఉండిపోయాడు బాలూ, రిజల్టు చెప్పటం మొదలు పెట్టింది డాక్టర్ మృదుల.
”మీ బ్లడ్ గ్రూప్ ‘ఏ’. మీ భార్య బ్లడ్ గ్రూప్ ‘ఓ’ ఆ విధంగా మీ పిల్లవాడి బ్లడ్ గ్రూప్ ‘ఏ’ అయితీరాలి. కానీ…..”
”కానీ…” ”కానీ.. మా వాడి బ్లడ్ గ్రూప్ ”బి”. ఆమె చెప్పటం పూర్తి చేసింది.
అనెషిస్తీయా యివ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధతో కూడిన షాక్ తగిలింది బాలూకి ఆ మాటలు వినగానే.
బాబు తన కొడుకు కాదు!… తనకు ఇంతద్రోహం చేసిన సౌదామినికి ఎలాంటి శిక్ష విధించాలి. అతడు ఆవేశంతో వూగిపోతున్నాడు…….
అవును ! తను సౌదామినిని చంపబోతున్నాడు ……”
సౌదామినికి ఎవ్వరూ లేరు. ఆమె బ్రహ్మానంద ఆశ్రమంలో పెరిగింది. కోరి పెళ్లి చేసుకున్నాడు బాలు. అయితే అనుమానపు నీడలు పరచుకున్నాయి. వారిరువురి దాంపత్యంపై పెను చీకట్లు ముసురుకున్నాయి. తనను వంచించిందనే కక్షతో భార్యనే మట్టుబెట్టాలనుకున్నాడు. అప్పుడే జరిగింది ? సౌదామినిని బాలు చంపాడా ? బాలు అనుమానాలు నిజమేనా? గుణవతి అయిన భార్య శత్రువవుతుందా ? కేవలం యండమూరి వీరేంద్రనాథ్ మాత్రమే సృష్టించగల మాస్టర్ విలనీ. మ్యూజిక్, రొమాన్స్‌ల బ్యాక్ డ్రాప్‌లో ఎత్తులూ పై ఎత్తులతో సాగిపోయే థ్రిల్లర్ ‘భార్యా గుణవతి శత్రు’.