Additional information
Author | Rainer Zitelmann |
---|---|
Format | Paperback |
₹225.00
‘భిన్నంగా ఉండటానికి సాహసించండి సంపన్నులుగా ఎదగండి’ అనే ఈ పుస్తకం’ త్వరగా ధనవంతులు అవండి’ అనే మరో కరదీపికలాంటిది కాదు. ఇది ఒక వ్యావహారిక జ్ఞానంతో ఆలోచనలని రేకెత్తిస్తూ 150 ఏళ్ళ సాంస్కృతిక, వాణిజ్య చరిత్రలోకి చేసే ఒక యాత్ర. దీన్నిండా ఎన్నో ఉపయోగకరమైన సలహాలూ, ఆసక్తిదాయకమైన వాస్తవాలు, వినోదాన్ని పంచే వృతాంతాలు ఉన్నాయి. ఈ పుస్తకం కాలిఫోర్నియాలో బంగారం గనుల కోసం అన్వేషణ కొనసాగించిన కాలం నుంచి యుద్దకాలంలోని బెర్లిన్ నంగరం దాకా వెళ్లి, మళ్ళీ ఈనాటి సిలికాన్ వ్యాలీ వరకూ వస్తుంది. డిస్నీల్యాండ్ నుండి సౌది అరేబియాకీ, లీవై స్ట్రాస్ నుంచి స్టార్ బక్స్ కాఫీ దాకా, జాన్ డి రాక్ఫెల్లర్ చమురుబావుల నుంచి వారెన్ బఫెట్ ఒమాహ దాకా మనల్ని తీసుకుపోతూ, అన్ని రకాల ప్రతికూల పరిస్థితులనీ ఎదుర్కొంటూ విజయం సాధించాలనే పట్టుదల, మరింత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం చేసే స్త్రీ పురుషుల కధలని మనసుకి ఆకట్టుకునేలా రచయిత చెబుతాడు.
వాణిజ్యవేత్తలైన స్త్రీ పురుషులు, ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సుప్రసిద్దులైన స్టీవ్ జాబ్స్, కోకో షనేల్, ఆర్నాల్డ్ స్వాజినేగర్ లాంటి వారి విజయగాధలను ప్రస్తావిస్తూ, జీవితంలో కొద్దోగొప్పో (లేక ఏమాత్రం)సాఫల్యం సాధించని అధికశాతం జనానికీ ఈ విజేతలకీ మధ్య ఉన్న తేడా కేవలం ఎక్కువ సంపద ఉండడం వల్ల మాత్రమే కాదని ఈ పుస్తకం విశదీకరిస్తుంది. విజయానికి అవసరమైన ఒక స్పష్టమైన తాత్వికతని అందిస్తుంది. కలలుకనే సాహసం చెయ్యగలవారందరి కోసం రాయబడిన పుస్తకం.
Author | Rainer Zitelmann |
---|---|
Format | Paperback |