Availability: In Stock

Chalam Sahityam – చలం సాహిత్యం

Author: Ranganayakamma
SKU: SWH361

40.00

చలం సాహిత్యంలో స్త్రీ స్వేచ్ఛ’ని తీసుకుంటే, దానికి అనుకూలించే పాజిటివ్‌ అంశాన్ని, దానికి హాని కలిగించే నెగిటివ్‌ అంశాన్నీ వేరుపరచి, దేన్ని స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో గుర్తించడం చాలా అవసరం.

ఈ సాహిత్యం మీద, ప్రారంభం నించీ చర్చలు సాగుతూనే వున్నాయి. మూడు రకాల ధోరణులు ఈనాటికీ వున్నాయి. చలంలో ఉన్న ఏ సానుకూలాంశాన్నీ పట్టించుకోకుండా, వ్యతిరేకాంశాల్ని మాత్రమే పట్టించుకొని, ‘చలం, పూర్తిగా తిరస్కరించదగ్గ రచయిత’ అని తేల్చే ధోరణి కొందరిది.

చలంలో వున్న ఏ వ్యతిరేకాంశాన్నీ గమనించకుండా ప్రతిదాన్నీ నిర్విమర్శగా స్వీకరించే ధోరణి మరికొందరిది.
గాఢంగా ఇష్టాలూ, తీవ్రమైన సందేహాలూ – రెంటితోనూ సతమతమయ్యే మూడో ధోరణి మిగతావాళ్ళది!
ఈ స్పందనలన్నీ ఈనాటికీ వున్నాయి.
చలం జయంతి సంవత్సరానికి వెనకటి నుంచీ ఆ మూడు ధోరణులూ కాని వింత ధోరణి ఇంకొకటి ప్రారంభమైంది. ‘స్త్రీ స్వేచ్ఛ’ పట్ల చలంలో దొరికే నెగిటివ్‌ అంశాలనే ఆదర్శాలుగా, ఆచరణీయాలుగా భావిస్తూ, చలం అవగాహన అంతా అదే అయినట్టు ప్రచారం చేసే ధోరణి అది!

‘స్త్రీ స్వేచ్ఛ’ గురించి ఏ తెలుగు రచయితలోనూ సరైన అవగాహనలేని కాలంలో జరిగిన తప్పుల పట్ల చూపే సహనం, ఈనాటి తప్పులపట్ల చూపకూడదు. ఆనాటి తప్పులకు వర్తించిన క్షమాపణ, ఈనాటి తప్పులకు వర్తించదు.

18 in stock (can be backordered)

Additional information

Weight 48 kg
select-format

Paperback

book-author

Ranganayakamma