Additional information
Format | Paperback |
---|
₹60.00
నా భార్య కావలసిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడిమీద పగ తీర్చుకున్నాను. నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళ చూసేను. కానీ ఒక్క చుక్క రక్తం నేల చిందకుండా ఎంతమంది స్త్రీల మంగళ సూత్రాలనో అపహరిస్తున్న బాబాయిలూ – పుడమితల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాలద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీ నారాయణ్‌లూ… నా ఆర్తి ఏ గుండెల్ని సృజించగలదు ? ఠాకూర్ మాటలు జ్ఞాపకం వచ్చేయి. ‘నీ ధ్యేయం వ్యక్తిగతం బేటా … నాది సాంఘికం – నీ పరిధి విశాలం కావాలి. నీ దృక్పధం విస్తృతమవ్వాలి” యండమూరి వీరేంద్రనాథ్ నవల చెంగల్వపూదండలో కృష్ణస్వగతమది.
ఒక చురుకైన పల్లెటూరి అమాయకుడైన యువకుడు అన్యాయంగా, అక్రమంగా సమాజంలోని దుష్టశక్తుల కుట్రకు జైలుపాలయ్యాడు. ఏ కారణం చేత ఎవరెవరు ఎలా వచ్చి చేరినా జైలే అన్ని విప్లవోద్యమాలకూ పాఠశాల. అక్కడే ఒక మహోన్నత విప్లవమూర్తి తారసపడి సమాజం గురించి విప్లవాల గురించి సమగ్రంగా నూరిపోసి అతడిని చైతన్యవంతుడ్ని చేశాడు. తరువాత జైలు నుంచి విడుదలయి వచ్చాక తన వ్యక్తిగత కక్ష సాధింపులో తాను లౌకికంగా విజయం పొందినా – అది ఎంత అల్పాతి అల్ప విషయమో గ్రహించి, గురువు బోధ గుర్తుకు వచ్చి – సంపూర్ణ విప్లవం వైపు నరసింహావతారుడై, కొండల్లోకి నడచి వెళ్ళిన ఓ ఉదయ భాస్కరుని ఉగ్ర చరిత్ర ఈ ‘చెంగల్వ పూదండ’ ఇంటిల్లిపాదీ చదవదగ్గ పుస్తకం.