Availability: In Stock

Dhyeyam – ధ్యేయం

SKU: BNAVA004-1-2-2-1-1-1-4-1-2-1-1-2

100.00

నాకు చచ్చిపోవాలనుంది నిఖితా” అంది మహతి ఏడుస్తూ ఒక రోజు.

”ఎందుకు?” అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో వున్న పార్కులో చెట్టు కింద కూర్చుని వున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్‌మేట్స్‌, మంచి స్నేహితులు కూడా.

”ఎందుకేమిటి ? మా అమ్మా నాన్నలకి నేనంటే ఇష్టం లేదు. ఈ రోజు తమ్ముడ్ని తీసుకొని పార్టీకి వెళ్ళిపోయారు. నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలేశారు. నన్నెందుకు తీసుకెళ్ళలేదో తెలుసా. నాకు మంచి బట్టల్లేవని. వాళ్ళు కొని పెడితేనేగా నాకు మంచి బట్టలుండేది ! తమ్ముడికైతే ఎంతో ఖరీడైన బట్టలూ బొమ్మలూ కొనిపెడతారు. నాకు కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బుండదు.”

”నువ్వు మీ అమ్మ నాన్నలని ధైర్యం చేసి అడగొచ్చుగా” అంది.

”ఏమడగను? ఏం అడిగినా లేదు… లేదు… అని సమాధానం వస్తుంది. అంతా నా కట్నం కోసం దాచి వుంచుతారట. అమ్మ సంవత్సరానికొక నగ చేయిస్తుంది. వాటిని బ్యాంకు లాకర్లో పెడతారు. కట్టుకోవడానికి మంచి బట్టలు గానీ చదువుకోవడానికి పుస్తకాలు గానీ ఇవ్వరు. వాళ్ళు ఏ పని చేసినా అది నా పెళ్ళిని దృష్టిలో పెట్టుకునే. ఎలాగోలా నాకు పెళ్ళి చేయటమే వాళ్ళ జీవితాశయం అన్నట్టు మాట్లాడతారు” అంది మహతి….

ఇది ఒకానొక కాలనీలోని పిల్లల కథ. బ్రహ్మ భవిష్యత్తును నుదిటి మీద వ్రాస్తే పెద్దలు పిల్లల మనసు మీద వ్రాస్తారు. బ్రహ్మ నుదుటి గీతైనా మారుతుందేమో గాని మనసు మీద పెద్దలు గీసిన గీతల ప్రభావం మాత్రం జీవితాంతం పోదు.

ఆ కాలనీలో చిగురు తొడిగిన మొక్కలన్నీ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. అయితే చెట్లకి అనుభవాలుండవు. కానీ మనుషులకి…? అక్కడ పుట్టిపెరిగిన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు ? ఎలా చెదిరిపోయారు ? ఏమయ్యారు ? ఆ చెట్లకే నోళ్ళుంటే ఎన్ని కథలు చెబుతాయో ! తెలుగు, కన్నడ భాషల్లో నెంబర్‌ వన్‌ రైటర్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ సామాజిక దృష్టితో అందిస్తోన్న ప్రయోజనాత్మక నవల – ధ్యేయం.

Additional information

Format

Paperback