Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
book-author | Ranganayakamma |
₹150.00
ఇంగ్లీషు కీకారణ్యంలోకి….
ప్రతీ పరాయిభాషా ఒక కీకారణ్యమే, చిన్నదో పెద్దదో! ఆ కీకారణ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం, దాని నియమాల్ని నేర్చుకుంటూ వెళ్ళడమే. ఆ నియమాల్ని, మాతృభాషలో వుండే నియమాలతో పోల్చుకుంటూ కూడా వెళ్ళాలి. భాషని నేర్చుకోవటానికి దాని వ్యాకరణంతో సంబంధం లేని సులువైన మార్గాలేవి వుండవు. అలాంటి ‘కిటుకు’లేవో వుంటాయని ఎన్నడూ భ్రమ పడకూడదు. భాషని నేర్చుకోవాలని నిజంగా కోరిక వుంటే, దాని వ్యాకరణం మీద కూడా ఇష్టం కలుగుతుంది. అయితే, వ్యాకరణ నియమాలు తెలుసుకోగానే ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలమని అర్థం కాదు. వ్యాకరణం అనేది భాషలోకి ప్రవేశించడానికి సాధనం మాత్రమే. ఇక మిగిలినదంతా తర్వాత జరిగే కృషిమీదే ఆధారపడి ఉంటుంది.
కానీ, వ్యాకరణ నియమాలు తెలియడంవల్ల వెంటనే జరిగే మేలు ఏమిటంటే, ఇంగ్లీషు పుస్తకాలు చదివితే అర్థమవుతూ వుంటాయి. ‘ఇంగ్లీషు పుస్తకాలు’ అంటే, విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలు. అంటే, విద్యార్థులు చదివే ఇంగ్లీషు పాఠాలు. అంతకుముందు అర్థంకాని వాక్యాలు, అక్కడవున్న నియమాలు తెలిసినప్పుడు ఎంతో తేలికగా అర్థమవుతాయి. అప్పుడు, ఆ భాష అంటే భయం పోతుంది. పైగా, కొత్త భాషని అర్థం చేసుకోగలుగుతున్నామనే ధైర్యం, సంతోషం ప్రారంభమవుతాయి. క్రమంగా అ భాషలోకి ప్రవేశం జరిగిపోతుంది.
ఒక పరాయిభాష పట్టుపడిందంటే, ఆ భాషలో నియమాలు నేర్చుకుంటేనే అది జరుగుతుంది. లేకపోతే, అది ఎవ్వరికీ, ఎప్పటికీ, సాధ్యం కాదు. కాబట్టి, ఒక భాష నేర్చుకోదల్చినవాళ్ళు మొట్టమొదట తెలుసుకోవలసింది ‘దాని వ్యాకరణం జోలికి పోకుండా అది సాధ్యం కాదు’ అని. ఈ సంగతి సరిగా అర్థం చేసుకుంటేనే భాషలు నేర్చుకోడం గురించి పొరపాటు అభిప్రాయాలన్నీ వదులుకుంటారు. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో దాని వ్యాకరణం నేర్చుకోవటానికి తమని తాము సిధ్ధం చేసుకుంటారు.
19 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
book-author | Ranganayakamma |