Availability: In Stock

Garuda Puranamu

SKU: VICTORY01

800.00

హిందూ మత ధార్మిక గ్రంధాలలో స్మృతులు ఒక భాగము. పురాణాలు కూడా స్మృతులే. పురాణాలలో గరుడపురాణం అంతగా అపనమ్మకాలు పాలైన వాటిల్లో మరొకటిలేదు. కొందరు పూర్వాచార పరాయణులు గరుడపురాణం చదవటం కాదు, కనీసం తాకడానికి కూడా ఇష్టపడరు. అందుకు కారణం ఆ పురాణం బ్రహ్మఖండంలో జీవికి మరణం తర్వాత కలిగే వివిధ సంస్కారాలు, అంత్యేష్టి వివరించబడటమే. అయితే గరుడపురాణం గరుడపురాణం మూడు భాగాలని అందులో బ్రహ్మ ఖండం చాలా చిన్నదని, ఆ ఖండంలోనే కొంత జీవి మరణానంతర కర్మకాండల గురించి చెప్పబడినదని ఎక్కువమందికి తెలియదు.

గరుడపురాణం వైష్టవ పురాణాలలో ఒకటి. ఇది మహావిష్ణువుకు అయన వాహనమైన గరుడునికి సంభాషణగా వివరింపబడిన పురాణం. గరుడపురాణం లో చాలా విలువైన  సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో వైద్యము, వ్యాకరణము, రత్నపరీక్ష, జ్యోతిష్యము, వంటి అనేక శాస్త్రాలు వివరించబడ్డాయి. అందుకని దీనిని విజ్ఞాన సర్వస్వ లక్షణాలు ఉన్న పురాణంగా పురాణ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతేగాక భారతీయ విజ్ఞానం అనేక సందర్భాలలో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈ పురాణంలో వివరించబడ్డాయి. అందువలన ఈ పురాణాన్ని విజ్ఞానం కావాలనుకునే వారందరూ అధ్యయనం చేయటం అవసరం. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలను పెట్టుకోనవలసిన అవసరం లేదు. దీనిని జిజ్ఞాసువులైన వారందరూ పటించిన భక్తి ముక్తి పొందగలరు.

18 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Vedavyasa Mahashi