Availability: In Stock
Gonthu Vippina Guvva
₹150.00
బతికిన క్షణాల మోహరింపు
శిలాలోలిత
Singh Arijit
Some
– this week.
in your leisure actie changes will take
ఒక రోజు సాయంత్రం పుస్తకం తెరిచి “ఈ గువ్వ ఎలా గొంతు విప్పిందో అని గమనించాను. నిజాల నిప్పురవ్వల్ని మోస్తూ, తనలోని భావ సంచలనాలన్నింటినీ, స్వచ్ఛంగా ప్రకటించిన తీరు నన్నాకర్షించింది.
ఇక, ఆ తర్వాత పుస్తకం నేనో, నేను పుస్తకమో అయిపోయాం . తన శైలితో పాఠకుల్ని తీసుకెళ్ళడం ఈ రచయిత్రికి అలవాటే. ‘అనాచ్ఛాదిత కథ’, ‘విరోదాభాస’తో సాహిత్య లోకంలోకి ఎప్పుడో అడుగులు వేసింది.
కానీ, వాటికీ ఈ రచనకు మధ్య బేధం వుంది. ఏ ఇనిబిషన్స్ లేకుండా తనను తాను ప్రకటించుకునే ధైర్యం, పెరిగిన దృష్టి కోణంతో విశ్లేషించిన తీరు చాలా ఆలోచనాత్మకంగా వుంది.
బాగా కావాలనుకున్న తీవ్ర కాంక్షలు పొందిన తర్వాత ఇంతేనా అన్పిస్తుంది. మనకు ఇష్టమైనవి దూరమైపోయినప్పుడు నిర్లిప్తత ఆవహిస్తుంది.
మనిషే శాశ్వతం కానప్పుడు, ఇళ్ళు, కుటుంబాలు కూలిపోతున్నప్పుడు నిరాసక్తత పెరిగిపోతుంది. వద్దనుకున్నా వైరాగ్యం వదిలిపోదు. శరీరం, పైకి మామూలుగా కన్పిస్తున్నా, లోపల కుప్పకూలిపోతుంది.. మనసంతా నీటిమయమైపోతుంది. ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ ఝాన్సీలోని రకరకాల షేడ్స్ కి ప్రతిరూపం.
18 in stock (can be backordered)