Availability: In Stock

Hrudayanetri – హృదయనేత్రి

Author: Malathi Chandur

80.00

‘గోపాలాన్ని – నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!” అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం.
పొందూరు ఖద్దరు చీరె – గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. రాముడత్తయ్య ‘వందేమాతరం’ అంటుంది. ఎవరో గాంధీగారుట, ఆయన్ని మహాత్ముడంటూ, ‘ఆ గాంధీగారు స్వరాజ్యం తెచ్చిపెడతాడు – తెల్లవాళ్ళందరిని తరిమి కొడతాడు’ అంటూ – రాత్రిళ్ళు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్పే రాముడత్తయ్య, వూరికి వెళ్ళిపోతోందీ అంటే ఏడుపు వచ్చింది గోపాలానికి –
”నీతో నేనూ వచ్చేస్తాను” అంటూ సంచీలో చొక్కాలాగూ పెట్టుకుని, రాముడత్త కొంగు వదలకుండా తిరుగుతున్నాడు పదేళ్ళ గోపాలం.
రాముడత్తయ్య అని పిలవబడే రామలక్ష్మమ్మగారు ఆ యింటి పెద్దాడబడుచు. నలభై ఏళ్ళుపైన వుంటాయి. పిల్లలు లేరు. ఆవిడ గురించి – విడ్డూరంగా పెద్దవాళ్ళు చెప్పుకోవటం చాలాపార్లు వినివున్నాడు గోపాలం. తన తల్లి సుబ్బమ్మకి, ఒదినగారంటే భయం – పైకి ‘ఒదినగారూ’ అంటూ – గౌరవంగా పిలుస్తూ – భయభక్తులతో వున్నా! ….

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Malathi Chandur