Additional information
Author | Yandamuri Veerendranath |
---|---|
Format | Paperback |
₹150.00
ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది.
ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా ‘దొప్ప’లున్న ”కామత్” ప్లేట్లు తయారు చేయించారు. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.
‘నీ జీవితాశయం ఏమిటి’ అని ఓబెరాయ్ నన్ను అడిగారు.” మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం” అన్నాడు. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల!
భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్‌కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద ‘కామత్’ అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పది లక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.
14 భాషల్లో అనువదింపబడి – రెండు యూనివర్సిటీలకీ నాన్‌డిటెయిల్డ్‌గా ఉన్న పుస్తకం.
ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన హోటల్‌గా ప్రథమ బహుమతి పొందిన ‘ఆర్కిడ్స్’ హోటల్ అధినేత విఠల్ ఆత్మకథకి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ విశిష్ఠ రూపకల్పన.
ఎలా ప్రారంభించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో, ఎలా బ్రేక్‌త్రూ సాధించాలో ఈ పుస్తకం చెపుతుంది. ఇది చదివి ఒకరైనా స్ఫూర్తి చెందితే ఈ రచన ఆశయం నెరవేరినట్టే.
Author | Yandamuri Veerendranath |
---|---|
Format | Paperback |