Availability: In Stock

Janapadam – జనపదం

SKU: BVPH008

300.00

దాశరథి రంగాచార్య రచించిన మూడవ నవల ‘జనపదం’. (మొదటిది ‘చిల్లర దేవుళ్లు’, రెండవది ‘మోదుగు పూలు’.) ఈ మూడు నవలలు తెలంగాణ ప్రజాజీవిత వాస్తవములకు అద్దం పట్టినవి.

నిజాం ఆసఫ్రాహి పాలకులు, వారి ఏజంట్లయిన జాగీర్దారులు, నిరంకుశులైన వారి చిల్లర ఉద్యోగులు – వారి పాలనలో తెలంగాణా ప్రజలు అనుభవించిన బాధల గాధల బృహత్‌ రూపదర్శనమే వారి నవలలకు ఇతివృత్తములు.

దాశరథి మూడో నవల ‘జనపదం’ తెలంగాణా విముక్తికి తరువాత పాత సారాయాన్ని కొత్త సీసాల్లో అందిస్తున్న మన దేశవాళీ రాజకీయాల ప్రభావాన్ని వివరిస్తున్న గాధ.

గత శతాబ్దాంతమున మహాకవి గురజాడ తన ”కన్యాశుల్కం”లో సమగ్రాంధ్ర ప్రజాజీవితాన్ని దర్శింప జేసినట్లుగానే  దాశరథి ఆచార్యులవారు తమ రచనల్లో సమగ్ర తెలంగాణమును దర్శింపచేశారు.

8 in stock

Additional information

Binding:

Paperback