Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹50.00
ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బెజవాడ నుండి బళ్లారి వెళ్తుండగా రైలు నడకలోని సమాన లయకు స్పందించి…. చుట్టూ వున్న నల్లమల అడవుల సోయగానికి పరవశించి ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ పలవరించారట. భావకవిత్వానికి అది మొదటి శృతి. అక్కడి నుంచీ కృష్ణపక్షం కవితలు ఆవిర్భవించడం మొదలయింది.
ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, వేదన, ప్రకృతి, విరహం, పదాల పోహళింపు, లయ…. వీటన్నిటి కలగలుపే ”కృష్ణపక్షము’. ఇదంతా 1921లో ప్రారంభమయి 1925లో పూర్తయింది. 1922లో కృష్ణశాస్త్రి భార్యా వియాగంతో కన్నీరు ఖండకావ్యం వచ్చింది. ఆ తర్వాత 1926లో ప్రవాసము, 1928లో ఊర్వశి వెలువడ్డాయి. కృష్ణపక్షము తెలుగు కవితా ప్రపంచంలో ఓ పెను సంచలనాన్ని రేపింది. భావకవిత్వం గొంతు సవరించు కుంది కృష్ణపక్షంతోటే. కృష్ణపక్షాన్ని వెక్కిరిస్తూ శుక్లపక్షం వంటి కొక్కిరింత రచనలు వచ్చినా అవి నిలువలేదు. కృష్ణపక్షం మాత్రం నేటికీ వెన్నెలలు కురిపిస్తూనే వుంది. అలా మిన్నెల్ల విహరించి మెరుపై మెరిసిన కృష్ణపక్షముతో పాటు ఈ సంకలనంలో ప్రవాసము, ఊర్వశి కూడా ఉన్నాయి.
నాకుగాదులు లేవు. నాకుషస్సులు లేవు అంటూ నిర్వేదం ప్రకటించి. ఏననంత శోకభీకర తిమిర లోకైకపతిని! అంటూ ప్రకటించుకుంటారు ఇందులో కృష్ణశాస్త్రిగారు. అంతేనా…. తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ భీష్మించుకు కూచుంటారు.
20 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |