Additional information
Format | Paperback |
---|
₹40.00
‘చూడవోయ్ నీలాంటి వాళ్ళను చాలా మందిని స్టడీ చేశాన్నేను. కస్టమర్ రాగానే మామూలు ధరకన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి, ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించటం, ఆ పైన ధరను కొద్దిగా తగ్గించి, ఆ కొనే వాడిని ఒక రకమైన ‘ట్రాన్స్’లో పెట్టేసి, ఆ పుస్తకాన్ని అమ్మేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే అయివుండచ్చు కానీ, ఈ ప్రయోగం నా మీద చెయ్యలేవు. కాబట్టి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఒక ధర చెప్పు” ఇలా సాగింది ప్రొఫెసర్ గౌరీనాథ్ సంభాషణ. ఆ షాపు వాడి మనసులో ఆయన చెప్పిన మాటలు చాలా సూటిగా నాటుకున్నాయి. అతని కళ్ళకు ఆయనో ఋషిలా కనపడ్డాడు. చాలా భక్తితో ఆ పుస్తకాన్ని అందిస్తూ ”రెండు రూపాయలు తగ్గించుకోండి సార్. కానీ దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా చెప్పద్దు” బ్రతిమాలేడు. ఆ షాపు వాడి కళ్ళలో కనబడే నమ్రతా భావాన్ని గౌరీనాధ్ తీక్షణమైన కళ్ళు పసిగట్టేశాయి. ఆయన కళ్లు గర్వంగా నవ్వేయి. అనూహ్యమూ, అభేద్యమూ అయిన ఆ షాపువాడి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ఆ పుస్తకాన్ని రెండు రూపాయలకి తక్కువకి కొన్న సంతృప్తి ఆయన కళ్ళలో ప్రతిబింబించింది.
తను విపులీకరించిన పద్ధతిలోనే షాపువాడు తనని మోసం చేసేడని గుర్తించని గౌరీనాథ్, కార్లో పుస్తకాన్ని పెట్టుకొని ఇంటి కొచ్చేశాడు. యండమూరి వీరేంద్రనాథ్ కథల సంపుటి ‘క్షమించు సుప్రియా’ కథలోని సన్నివేశమిది. దీనితో పాటు ఇంకా ఇలాంటి రసవత్తర సన్నివేశాలున్న కథలు మరో పదకొండు ఉన్నాయి.
అంతే కాదండోయ్. మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నారోకూడా ఈ పుస్తకం చెబుతుంది. అయినా సంతృప్తి కలగటం లేదా మీకు. అయితే రచయిత మిమ్మల్ని తనతో పాటు ప్రపంచ పర్యటన చేయిస్తాడు. దేశదేశాల సంస్కృతులూ – వాళ్ళ సమస్యలూ – యండమూరి వీరేంద్రనాథ్ కథల సంపుటి – ‘క్షమించు సుప్రియా’.