Additional information
Format | Paperback |
---|
₹90.00
అతడు లైటార్పి, బెడ్‌లైట్ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు.
తరువాత బెడ్‌లైట్ వేసి ‘చాలా’ అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది …. దంతక్షతం – ఇంద్రధనుస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనుస్సు అందుకున్నాడు….
-ఇరవై నాలుగు సంవత్సరాలుగా పర్వతశ్రేణుల మధ్య ఘనీభవించిన నీటి చుక్క, కోర్కె స్పర్శకి కరిగి ఆవిరి కాబోతున్న వేళ…
-పదహారు సంవత్సరాల ప్రాయం నుంచీ పరువాన్ని నిలుపుకుంటూ వస్తున్న పౌరుషం-పురుషత్వం ముందు ఓడి గెల్చి-గెలుపు సిగ్గుతో తల వంచుకునే సమయాన … తలుపు మీద టక్‌టకా లాఠీ కర్రతో కొట్టిన చప్పుడు…
ఆమె బిత్తరపోయింది. అతడు అయోమయంలో చిత్తరువు అయ్యాడు. రెండు నిమిషాల తర్వాత తలుపు తీశాడు. ఎదురుగా పోలీసు ఇన్‌స్పెక్టర్ నిలబడి వున్నాడు.
”మిస్టర్ రాయన్నా! లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ పదమూడులో అపురూపలక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను.”
ఆ సమయంలో ఆ వార్తకి రాయన్న విభ్రాంతి చెందాడు.
రాయన్న ఒక మంచి క్రికెటర్. శోభనంనాటి రాత్రి ఓ హత్యానేరం మీద అరెస్టు అవుతాడు. హత్య చేయబడింది అపురూప లక్ష్మి అనే హాస్టల్ అమ్మాయి. ఒక యధార్ద సంఘటన ఆధారంగా లేడీస్ హాస్టళ్ల స్థితిగతులపై వెలుగు ప్రసరిస్తూ … సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వెలువరించిన ఇన్‌వెస్టిగేటివ్ నవల.