Additional information
Binding: | Paperback |
---|---|
Pages | 166 |
₹140.00
తెల్లని పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్ ప్రసాద్ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దు:ఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు; బయటకి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ బైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ వుండగా కనీకనబడని చెమ్మతో కళ్ళు మసకబారే పఠనానుభవం. – పూడూరి రాజిరెడ్డి
ఈ కథల్లో తీరని దిగులుతో కల్పన సాకుగా అజయ్ తన జ్ఞాపకాల్ని నిమురుకున్న ప్రతి సందర్భమూ నాకు నచ్చింది. కల్పనలు జ్ఞాపకాలుగా మారుతున్న సందర్బాలు కూడా. – మెహెర్
పేజీలు : 166
9 in stock