Additional information
Author | Yandamuri Veerendranath |
---|---|
Format | Paperback |
₹150.00
విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ”మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.
”ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ”ఇరవై అయిదేళ్ళకి” అంటారు.
”అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు)
అసలు పైకి రావటం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి దండ్రుల్ని అనాధాశ్రమంలో చేర్చాడు. వీరు జీవితంలో పైకి వచ్చినట్టా?”
పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.
శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే ”స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ”విజయానికి అయిదు మెట్లు” రచయిత అందిస్తున్న మరో మాస్టర్ పీస్ ‘లోయ నుంచి శిఖరానికి’.
Author | Yandamuri Veerendranath |
---|---|
Format | Paperback |