Availability: In Stock

madhuranthakamRajaram samgra sankalanam

SKU: EMESCO006

3,000.00

16 in stock

Category:

Description

సర్కసు డేరా

ఏ పుట్టలో పాములుంటాయో, ఏ పుట్టలో ఈసిళ్ళుంటాయో యిర్లవాడికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. భుజాన మోపెడు ఈతపుల్లలతోనూ, చేత నీళ్ళదుత్తతోనూ వాడొకడు మీకు పల్లెపట్టుల్లో ఎదురైతే, అతగా డక్క డెక్కడో పుట్టమూసి ఈసిళ్ళు పట్టబోతున్నాడన్న మాట! కీటక సంహారకాండలో నాందీ వాచకంగా అతడు పుట్టలో ముఖ్యరంధ్రాన్ని మాత్రం మినహాయించి, మిగిలిన వాటిని మూసేస్తాడు. ఆ తరువాత చిక్కగా నీళ్ళు చిలకరిస్తాడు. రంధ్రానికి చేరువగా ఒక దిగుడు అమర్చి అందులో దివ్వె వెలిగిస్తాడు. ఎండుమట్టి పైన చల్లటి నీళ్ళు పడ్డంతో నీటి ఆవిరి పైకెగిరి, పుట్టలోపలి కీటకాలకు వాన కురుస్తున్నట్టో లేక కురిసి వెలిసినట్టో భ్రమ కలుగుతుంది. బారులు బారులుగా అవి పైకొస్తాయి. వచ్చీరాగానే మృత్యుదేవత క్రూర దంష్ట్రలాంటి దీపశిఖ వాటిని ఆహ్వానిస్తుంది. అవి మొదట రెక్కలు రాల్చుకుంటాయి. తరువాత యిర్లవాడికి మరునాటి ఎరగా మారిపోతూ కుప్పగా కూలిపోతాయి.

పూర్తిగా కాకపోయినా, కొంతవరకూ ఈ ‘పుట్టమూత’తో పోలికలున్న సంఘటన ఒకటి పట్టణంలో జరిగింది.

గంటల కల్లా భోజనాలు ముగించి, జంబుచాపలు పరచుకోవడం తరువాయిగా దీపాలు ఆర్పేసి, వెచ్చగా వక్కాకు నములుతూ అరుగులపైన కూర్చున్న పల్లెటూళ్ళవాళ్ళకు ఆకాశంలో ఓ కాంతిపుంజం కనిపించింది. అది అచ్చంగా కాంతిపుంజం కూడా కాదు. భువినుండి దివికి ఏటవాలుగా ప్రసరిస్తున్న వెలుగుబాట. ‘ఎన్నడూ లేంది, ఏనాడూ వినంది, ఏమిటీ విడ్డూరం’ అని ఒక వైపున జానపదులు వెరగుపడిపోతున్నారు, మరొకవైపున ఆ వెలుగు వినువీధిలో నాలుగైదుసార్లు వలయాలు తిరిగి, అంతటితో తన పని తీరిపోయినట్టు అంతర్ధానమైపోయింది.

మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు ముందుగా కనిపిస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం. ఇక్కడగూడా సరిగ్గా అలాగే జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, ఆ ప్రాంతంలో వెలుగు కనిపించింది

Additional information

book-author

madhurantakam rajaram

select-format

Paperback