Availability: In Stock

Mahathmudu Aayana Sidhantaalu

SKU: BVPH242-2-2-1

90.00

 బ్రిటీషు సామ్రాజ్యవాదానికి అర్జీలు దాఖలా చేసుకుని తన దేశప్రజల్ని విముక్తుల్ని గావించాలనుకున్న మోహన్ దాస్ కరం చంద్ గాంధీ విజయమో, వీరస్వర్గమో నినాదాన్ని ఏ విధంగా ఇవ్వగలిగాడు? ఆ పరిస్థితులకు ఆయన ఎందుకు నెట్టబడ్డాడు? కొల్లాయిగట్టి, సామాన్యజనాన్ని సహాయనిరాకరణోద్యమానికి ఏ విధంగా పురికొల్ప గలిగాడు? “అహింసా” మార్గంలో ప్రజలను కార్యోన్ముఖులను చేసి పాశవికమైన బ్రిటీషు దమనకాండ నెదిరించి కోట్లాది మంది ప్రజలు పాల్గొనే రీతిలో ఉప్పు సత్యాగ్రహానికి ఎట్లా నాయకత్వం వహించాడు?.

          ప్రభుభక్తీ పారాయణ కుటుంబంలో జన్మించి, ఆ ప్రభువులనే ఎదిరించగలిగిన శక్తి ఆయనకెట్లా వచ్చింది? ఉద్యమం తీవ్రరూపం దాల్చినపుడు, తన సన్నిహిత స్నేహితులూ, శిష్యులూ నిరసించినప్పటికీ ఉద్యమాన్ని ఎందుకు వెనక్కులాగాడు? బహుశ సంస్కృతుల దేశంలో పుట్టి, ఆ దేశంలోని మతోన్మాదులను తనదైన మార్గంలో వ్యతిరేకించి హిందూ – ముస్లిం ఐక్యతకోసం తన ప్రాణాన్ని ఏ విధంగా వడాడు? కరం చంద్ గాంధీ “బాపూజీగా, జాతిపితగా” ప్రజలచేత ఏ విధంగా కొనియాడబడ్డాడు? రాజకీయాల్లో ఆయన వారసత్వం ఎవరికీ దక్కాలి?.

ఈ ప్రశ్నలన్నింటికీ కామ్రేడ్ నంబూద్రిపాద్ అద్భుతమైన రీతిలో ఈ పుస్తకంలో జవాబులిచ్చాడు. రాహకీయాల్లో ఉన్నవారేగాక, నేటితరం యువకులు సహితం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి.

20 in stock (can be backordered)

Additional information

Weight 48 kg
select-format

Paperback