Availability: In Stock

Mahodayam

600.00

5 in stock (can be backordered)

Description

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్

ప్రపంచ చరిత్ర మొత్తం ఆర్థిక సంబంధాల చరిత్రయే.
ప్రపంచ చరిత్ర మొత్తం స్త్రీ పురుష సంబంధాల చరిత్రయే.
ప్రపంచ చరిత్ర మొత్తం మత సంబంధాల చరిత్రయే.

ఈ మూడు సిద్ధాంతాలతో విశ్వచరిత్రను వ్యాఖ్యానించారు. కాదంటే జాతీయవాదం (నేషనలిజం) ప్రాంతీయవాదం (రీజనలిజం), భాషావాదం (లింగ్విస్టిక్ మూవ్మెంట్) కులవాదం – (బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, మాల, మాదిగ, కాపు వైశ్య)

ఇలా వ్యాఖ్యానాలూ జరిగాయి. ఇవన్నీ అసత్యాలు కావు. పూర్తి సత్యాలూ కావు.

కమ్యూనిష్టులలో సిపిఐ, సిపియం, పి.పి.ఐ. ఎం.ఎల్, రాడికల్ కమ్యూనిజం ఇలా పాతిక శాఖలున్నాయి. అందరూ పేదవాడి కోసమే అంటారు. ప్రచారం చేసే కార్యకర్తలూ, కావ్యకర్తలూ, ధనవంతులూ, వ్యసనపరులు కావటం కొసమెరుపు.

బ్రాహ్మణులలో వైదీకి – నియోగి భేదాలున్నట్లే ముస్లిములలో షియా, సున్నీ తగాదాలున్నాయి. వీరశైవులలో పంచాచార్య, లింగాయత భేదాలున్నట్లే వైష్ణవులలో వడగల్, తెంగల్, సిక్కులలో కేశధారి, నిరంకారి; జైనులలో శ్వేతాంబర, దిగంబర ఇలా అంతర్భేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సారాంశమేమంటే మానవుణ్ణి సమగ్రంగా చూచే తాత్విక దర్శనం ముఖ్యమైనది. దీనిని ఇంటిగ్రల్ హ్యూమనిజం అన్నారు.

ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కాకతీయ సామ్రాజ్యం, విసునూరు ప్రోలయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, ఛత్రిపతి శివాజీ సామ్రాజ్యం ఇవన్నీ రైతుల చేతనే స్థాపింపబడ్డాయి అనేది వాస్తవం………………….

Additional information

Weight 48 kg
select-format

Paperback