Additional information
Format | Paperback |
---|
₹90.00
‘తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది. కేవలం సినిమాల్లో, కథల్లో జరుగుతాయనుకున్న సంఘటనలు మరింత మెలో డ్రమెటిక్‌గా జీవితంలోనూ ఎదురుపడవచ్చు. దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి స్నేహితురాలు ‘విశాల’ భర్త తన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడని అనూరాధ కలలో కూడా ఊహించలేదు. అదలా జరిగిపోయిందంతే……”
ఆ నలుగురూ క్లాస్‌మేట్స్. జీవితం పొలిమేరల నాలుగురోడ్ల కూడలిలో ఆ నలుగురు పరికిణీ అమ్మాయిలు నిలబడి వీడ్కోలు తీసుకున్నారు. జీవితంలో మరికొన్నేళ్ల తర్వాత తమ అనుభవాలను పంచుకోవటానికి మరోసారి కలుసుకోవాలని నిర్ణయించుకుని విడిపోయారు. జీవితం అంటే పూలపాన్పని కలలు కనే వయసులోని ఆ టీనేజీ అమ్మాయిలకు వాస్తవలోకం తెలిసివచ్చింది. అనుకున్న టైమ్‌కి వాళ్లు ఏ పరిస్థితుల్లో కలుసుకున్నారు ? వాళ్ళకి ఎదురైన అనుభవాలేమిటి ? వాటిల్లో తీపెంత ? చేదెంత ? పురుషాధిక్యతని తన శైలికి భిన్నంగా – గుండెల్లోతుల్ని స్పృశిస్తూ యండమూరి వీరేంద్రనాథ్ వెలువరించిన సస్పెన్స్ లెస్ థ్రిల్లర్ మంచు పర్వతం. ఇది ‘జ్యోతి’ మంత్లీ సీరియల్.