Additional information
Format | Paperback |
---|
₹50.00
మీరు మంచి అమ్మాయి
– చదివిన చదువు చాల్లే అని తల్లి దండ్రులంటే బుద్దిగా చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు.
-పెళ్ళి చూపుల్లో తలెత్తి చూడకుండా తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకున్నారు.
– ‘ఆడపిల్లలం’టే అలా ఉండాలి అని ఇరుగు పొరుగుపొగుడుతుండగా అత్తవారింటికి వెళ్ళారు.
– అత్త పెట్టే ఆరళ్ళన్నీ సహనంతో భరించారు.
– భర్త సిగరెట్‌నీ, తాగుడినీ, పేకాటనీ ఓర్పుతో సహించారు. భర్తకి సినిమాలిష్టం లేదని మీరూ మానేసారు. భర్తకోసం కట్టూబొట్టుతో పాటు మీ అభిరుచుల్నీ మార్చుకున్నారు.
– నీకేం తెలియదమ్మా, నువ్వూరుకో అని కొడుకూ, కూతుళ్లూ కసురుకుంటుంటే అదో బిరుదులా మీ అమాయత్వాన్ని మురిసిపోయారు.
– మా బామ్మా పాతకాలపు మనిషని మనవడు పరిచయం చేస్తుంటే అదో క్వాలిఫికేషన్ అనుకున్నారు.
ఇంతమందితో మంచి అనిపించుకోవటం కోసం మీరెంత కోల్పోయారు? ఇంతకీ మీరెవరితో మంచి అనిపించుకోవాలనుకుంటున్నారు, దానికోసం మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటి?
మీరు మంచి అనిపించుకోవలసినది మీ మనసుతో. ఇంత ఆనందాన్ని జీవితకాలం పాటు నాకిచ్చిన ఈ అమ్మాయిలో నేనుండటం నా అదృష్టం అని మీ మనసు నిరంతరం అనుకోవాలి. అంతేగానీ మీ తల్లిదండ్రులూ, భర్తా, పిల్లలూ, అత్తా మామలు, మరుదులూ, మనవళ్లూ కాదు. అలాంటి ఆరోగ్యకరమైన ఆనందాన్ని వ్యక్తిత్వము అంటారు. దాన్ని ఎలా సాధించాలో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. నేనిప్పుడు బాగా’నే’ వున్నాను అనుకుంటే మీరీ పుస్తకాన్ని చదవద్దు అంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్.