Additional information
Format | Paperback |
---|
₹50.00
తిరస్కారపు పీడకలల్తో పెరిగిన చిన్నారి నేర్చుకొనేది పరనింద. ద్వేషపు ఆవేదనలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది కొట్లాట. అవహేళన అనే గుంజిళ్ళు తీసిన చిన్నారి నేర్చుకునేది సిగ్గు. అవమానం అనే గోడ కుర్చీ వేసిన చిన్నారి నేర్చుకునేది అపరాధ భావం.
సహనంలో ఊయలలూగిన చిన్నారి నేర్చుకునేది శాంతం. ప్రోత్సాహపు గోరు ముద్దలు తిన్న చిన్నారి నేర్చుకునేది ఆత్మవిశ్వాసం. నిజాయితీ మూడు చక్రాల బండి నడిపిన చిన్నారి నేర్చుకునేది న్యాయం. సద్భావపు జన్మదినాలు జరుపుకున్న చిన్నారి నేర్చుకునేది నమ్మకం. అనురాగపు జోలపాటలు విన్న చిన్నారి నేర్చుకునేది సంతృప్తి. స్నేహపొత్తిళ్ళలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది ప్రపంచం మీద ప్రేమ.
మన పిల్లలని మనం గౌరవించడమనేది ఎంతో ముఖ్యం. ఇక్కడ గౌరవించడం అంటే వారి అభిరుచుల్ని ప్రోత్సహించడం, వారికీ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడమని అర్థం. పిల్లల పెంపకంలో గౌరవం, ప్రేమ పునాదిరాళ్ళుగా వుంటే వాటిమీదే పిల్లల ఉన్నత వ్యక్తిత్వం నిర్మించబడుతుంది. అది అద్దాలమేడా, అందమైన మేడా అనేది మీ చేతిలో ఉంది.
మీరు చదవబోయే పేజీల్లో – మనిషిని మనిషి ఎందుకు గౌరవించాలి? పిల్లలు తమ తండ్రులకు ఎంత విలువ ఇవ్వాలి? తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎంత విలువ, గౌరవం ఇవ్వచ్చు, ఒకే ఇంటో వ్యక్తుల మధ్య బంధాలు సరిగ్గా లేకపోతే మానసిక పరమైన అనారోగ్యాలు, వ్యక్తులు, వ్యక్తిత్వ పతనం ఎలా ఉంటుంది?
మీ పిల్లలకు మీరిచ్చే బహుమతి వాళ్ళకూ ఒక మనసుంటుందని గుర్తించడం, ఆ మనసుకు ఆలోచించే జ్ఞానం ఇప్పుడిప్పుడే వస్తుందని గ్రహించడం అంటున్నారు ‘మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే’ పుస్తక రచయిత యండమూరి వీరేంద్రనాథ్.