Additional information
Format | Paperback |
---|
₹60.00
పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని – ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ –
పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి రావాలా అని మధనపడే యువకుల గురించీ, ముఫై ఏళ్లొచ్చినా అత్తపోరుతో సతమతమయ్యే గృహిణుల సమస్యల గురించీ, నలభై ఏళ్లొచ్చినా ఒక వ్యక్తిత్వం – గుర్తింపు కోసం తాపత్రయపడే అనామకుల గురించీ –
నలభైఅయిదేళ్ళ వయసులో భర్తకి తనకన్నా ముందే మరో స్త్రీతో వివాహం జరిగిందని తెలిసిన అభాగ్యుల కన్నీళ్ళ గురించీ –
యాభై ఏళ్ళ వయసులో తన జీవితం అయిపోయిందే అంటూ ఏర్పడే దిగులు గురించీ –
యాభైఏళ్ళ వయసులో తమ పిల్లలు తమని దూరం చేస్తున్నారన్న ఫీలింగ్ వల్ల ఏర్పడే భయాల గురించీ –
ఇంకా … దర్శకత్వం నేర్చుకోవటం గురించీ, టి.వి.ల్లో నటన గురించీ, మోసం చేసేవాళ్ళ గురించీ, మోసగింపబడే వాళ్ళ గురించీ – మరెన్నో మానసిక సమస్యల గురించీ –
యక్షప్రశ్నలకు – లక్ష సమాధానాలుగా – ‘మిమ్మల్ని మీరు గెలవగలరు’ ఈ పుస్తకంలో యండమూరి వీరేంద్రనాథ్ వివరిస్తున్నారు