Additional information
select-format | Paperback |
---|---|
book-author | Madireddy Sulochana, Vanga Rajendra Prasad |
₹300.00
ఏడాదికోసారి ‘హెల్త్ చెకప్’ చేయించుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ‘వెల్త్ చెకప్’ చేయించుకుంటే ఆర్ధిక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనీపర్స్ చదివితే వెల్త్ చెకప్ అయి ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకాలు.
– గంపా నాగేశ్వరరావు గారు
లక్ష్మీదేవి తన భార్యే అయినా వెంకటేశ్వర స్వామి నిత్యం నిలబడి సంపాదిస్తున్నాడు. కానీ కుబేరుడు..? కుబేరుడిలా కూర్చొని, పడుకుని, నిద్రపోతూ కూడా సంపాదించాలి అనుకుంటారా? కుబేరుడిలా శ్రమలేని ఆదాయం రావాలంటే ఆయనలా మీ డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియాలి. ఆ ఆర్ధిక అక్షరాశ్యతలో భాగంగానే మనీపర్స్ 1 & 2 వచ్చాయి. ఇప్పుడు మనీపర్స్ – 3 మీ చేతిలో ఉంది. చదవండి…
ఈ పుస్తకం ద్వారా ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారా మీరు? ఐతే, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చదవకండి. తెలుసుకుంటే జీవితాలు మారవు. తెలిసిన విషయాలను ఎంతవరకు ఆచరిస్తున్నారని మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి చదవండి. పొద్దున్నే లేచి ఓ గంట నడిస్తే లాభం అని నాకు తెలిస్తే… ఏం లాభం? నడిస్తే లాభం. అలా రోజూ నడిచేంత వరకు నడక వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూనే ఉండాలి నేను. అలాగే మన జీవిత ఆర్ధిక ఆరోగ్యం ఎలా ఉందో మనకి మనం తెలుసుకునేందుకు మన ఫైనాన్స్ ని మనమే స్కానింగ్ చేసుకోవాలి. అందుకు ఈ పుస్తకం కొంతవరకు పనికొస్తుందని నమ్ముతున్నా.
ఈ పుస్తకంలో…
ఎంత సంపాదించాలి?
ఇల్లుకొందామా? అద్దెకుందామా?
పర్స్ లో పైసా తీయకుండా ఫ్లాట్ ఋణం తీర్చవచ్చా?
ఇంటి రుణ వాయిదాలు భారం అయితే.. ఏం చేయాలి?
అద్దెకారు తీయన… సొంతకారు పుల్లన ?
18 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Madireddy Sulochana, Vanga Rajendra Prasad |