Additional information
select-format | Paperback |
---|---|
book-author | M V V Satyanarayana |
₹250.00
అగథా క్రిస్టీ గురించి ఒకరు చెప్పగలిగే దేముంటుంది? పేరు పొందిన రచయిత్రి ఆమె. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొదీ తన రచనలు అమ్ముకోగలిగిన రచయిత్రి. ప్రపంచ భాషలలోనికి తన కథలు, నవలలు అనువాదం చేయించుకోగలిగిన చెయ్యి తిరిగిన రచయిత్రి. అంతేకాదు, పిస్టల్ అనేది ఎలా ఉంటుందో తాకి చూడకుండానే పుంఖాను పుంఖాలుగా అపరాధ పరిశోధక రచనలు చేసినట్లు కూడా
పేరు మోసిన రచయిత్రి. ఈ సంపుటిలో సాధారణ పాత్రలూ ఉంటాయి. సాధారణ సంఘటనలూ ఉంటాయి. అయితే అసాధారణమైన రచనా వైవిధ్యంతో, మనస్తత్వ కల్పనతో రచయిత్రి ప్రతి కథకు ఊహించలేని స్థాయిలో ముగింపును సిద్ధం చేస్తారు. క్లుప్తమైన, సూటియైన సంభాషణలు పాఠకుల మస్తిష్కాలను ఉత్తేజ పరుస్తాయి. తాను చూసిన లండన్ మహా నగరంలో నిత్యం జరిగే సంఘటనలకు ఆమె తన కథనశైలితో, రచనావిన్యాసంతో, మలుపులూ, మెరుపులూ కల్పించి ప్రచురించిన ఇరవై నాలుగు కథల ఆసక్తికర సమాహారమిది. – ఆంగంలో వీటిని చదివినవారు సైతం తమ తొలి పఠన స్మృతుల పరిమళం తిరిగి పొందుతారు. చదవనివారు ఊపిరిసలపని ఉత్కంఠతో పాటు ఈ కథల రచనాశిల్పంతో రసాస్వాదనను సొంతం చేసుకుంటారు, ఈ కథలు వేటికవే నూటికి నూరు శాతం సంతృప్తి కలిగిస్తాయి.
19 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | M V V Satyanarayana |