Availability: In Stock

Nalla Chepapilla Katha – నల్ల చేపపిల్ల కథ

20.00

చైతన్య ప్రవాహంలో ఈదులాడే ఓ చిన్న ‘నల్ల చేపపిల్ల’ కథ ఇది. ప్రపంచం అంచుల్ని చుంబించాలనే తపన. నూతన ప్రపంచంలో ఆవిష్కృతం కావాలనే తిరుగులేని పట్టుదల. ఆ అద్భుత ప్రయత్నంలో చేప పిల్ల పొందిన ఎన్నో వింత అనుభవాలు, ప్రకృతి పారవశ్యాలు, విరుచుకుపడ్డ ప్రమాదాలు, వాటితో చెలగాటాలు, ఎవరెవరితోనో పరిచయాలు. శత్రు మిత్ర భావనలు, అననుకూల పరిస్థితులు, శత్రువుపై పన్నిన యుద్ధ వ్యూహాలు, మొక్కవోని ధైర్యసాహసాలతో ముందుకు మున్ముందుకు సాగించిన స్వేచ్ఛా ప్రయాణం. అదో భయమెరుగని జీవనగమనం.

నిజంగా ఇది కేవలం చేపపిల్ల కథేనా! అవును నిజమే బెహరంగీ అల్లిన మరో ‘పంచతంత్రం’ కథ. ఇది మనిషి స్వేచ్చా పిపాసకు, జ్ఞాన తృష్ణకు ఎత్తిపట్టిన ప్రతీక.

తన జాతిజనులలో, ఇంకా చెప్పాలంటే ప్రపంచ మానవాళిలో స్వాతంత్య్రేచ్ఛని, అందుకవసరమైన చైతన్యాన్ని రగుల్గొలిపేందుకు సమద్‌ బెహరంగి చేసిన అద్భుత సృజన ‘నల్ల చేపపిల్ల కథ’.

Additional information

Author

Samad Behrangi

Format

Paperback