Availability: In Stock

Narakamlo Harishchandrudu

SKU: VPH0485

60.00

  పురాణగాథలపై నార్లవారి విమర్శలలో ముఖ్యమైన మూడవది “నరకంలో హరిశ్చంద్రుడు”. ఆయన అభిప్రాయంలో మనకు “సుపరిచితుడైన” సత్యహరిశ్చంద్రునితో పాటు మరో ఇద్దరు హరిశ్చంద్రులున్నారు. ఒకడు అసత్య హరిశ్చంద్రుడు కాగా, మరొకడు రాజర్షి హరిశ్చంద్రుడు. ఈ ముగ్గురు హరిశ్చంద్రులు మన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తారంటారు నార్ల. ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, భారతం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, శివ పురాణం, భాగవతం, దేవీభాగవతం మొదలైన పురాణ గ్రంథాల్లో ఈ ముగ్గురు హరిశ్చంద్రులు కనిపిస్తారు. 

మార్కండేయ పురాణంలోని గాథకే అధిక ప్రాధాన్యం లభించిందనీ, అందులోని హరిశ్చంద్రుడి గాథే మనకు సత్యహరిశ్చంద్రుడిగా దర్శనమిస్తున్నాడని నార్లగారంటారు. ఈ నాటకానికి ఆయన రాసిన పీఠిక కూడా దాదాపుగా సమగ్రమైన “పురాణ విమర్శే”. పదకొండవ శతాబ్దిలో క్షేమేంద్రుడు రాసిన “చండకౌశిక” నాటకం నుండి, పదిహేనవ శతాబ్దిలో గౌరవ రాసిన “హరిశ్చంద్రోపాఖ్యానం”, పదిహేడవ శతాబ్దికి చెందిన రామరాజభూషణుడు రాసిన “హరిశ్చంద్రనలోపాఖ్యానం”, కందుకూరి వీరేశలింగం రాసిన నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన నాటకం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన “కావ్యవేదహరిశ్చంద్ర” నాటకాల వరకూ నార్లవారు పరిశీలించినట్లుగా ఆయన పీఠికలో రాశారు.

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Narla Venkateswara Rao