Availability: In Stock
Neelaveni – నీలవేణి
₹100.00
అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్ కుమార్ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం.
ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్ వరకూ ఏ అంశం ఆయన కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే.
అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్ (వ్యంగ్యం) సునీల్ కుమార్ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతోంది ఈ కథా సంపుటిలో.
”దెయ్యాలు’ ప్రేమను పంచినా, ‘డిసిప్లి’లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్ కుమార్ మార్కు పంచ్ లోనే.
‘థూ’ అన్నా, ‘చీకటి’ కన్నా, ‘పరిశుద్ధంగా’ వివాహాన్ని ‘దేవదాసు’ జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు.
ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది…. రంగుల హరివిల్లులా నవ్వులు పూయించగల హాస్య-వ్యంగ్య వైభవం ఉంది.
అక్షరాల ఇది అనితరసాధ్యం… అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.