Availability: In Stock

Nela Jaarina Mugdatvam

SKU: GANTI01

150.00

నేల జారిన ముగ్ధత్వం

“శనివారం ఉదయం పది గంటలకి మా స్కూలు ఆడిటోరియంలో ఓ చినసభ ని ఏర్పాటు చేసాము. దానికి మీరుభయులూ రావలసిందిగా కోరుతున్నాం” అని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసారు. ఓ విధంగా అర్థించారు. రిక్వెస్ట్ చేసారు.

ఆ మాటలు విన్నాక విద్యా సాగర్ ఏం మాట్లాడ లేదు. జవాబివ్వడానికేం లేదు. స్కూలుకి ఎందుకు రమ్మంటున్నారో తెలుసు.

వెళ్తే ఏం మాట్లాడాలి,? అసలు మాట్లాడేందుకేం ఉంది ? ఏమీ లేదనిపించింది. అందుకే నిశ్శబ్దంగా భార్య విజయని చూసాడు. మౌనం ఓ సుదీర్ఘమైన భాష . భాషతో పనిలేని కమ్యూనికేషన్. వారి మధ్య అగాధాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎన్నింటినో మింగేసింది.

అందుకే ఆమె ఫోన్ ఎవరిది, ఎక్కడ నుంచీ అని ఏం అడగలేదు. అయినా విద్యా సాగర్ ఆమెకి చెప్పాడు.. ఇప్పుడు స్కూలు ప్రిన్సిపాల్ మాటలకి , ఇప్పుడిప్పుడే ఆరుతున్న కళ్ళు మరోసారి ఊట బావులయ్యాయి. వారి గుండెల్లో పేరుకు పోయిన దుఃఖం కళ్ళల్లోకి వచ్చేసింది. ఎన్నో జ్ఞాపకాలు అప్పుడే పైపొర తొలిగిన పచ్చి పుండ్లలా సలిపేస్తున్నాయి. అవి అన్ని రాత్రింబవళ్ళు అక్కర్లేని అతిథుల్లాగా

ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో వాళ్ళకి తెలీడం లేదు. ఆ జ్ఞాపకాల లోంచి ‘అమ్మా నాకు బతకాలని ఉంది, ఇప్పుడే చావాలని లేదు’ అంటూ బాధ పడుతూ, ఏడుస్తున్న శ్వేత కనిపిస్తోంది. ఆమె గొంతు వినిపిస్తోంది………..

18 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Ganti Bhanumathi