Availability: In Stock

Nikasham

SKU: anvikshi01

70.00

ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు

నిన్నటి ప్రత్యూషం నేడు లేదు

ఈ రోజుటి ప్రదోషసంధ్య, రేపటికి పాతది….మాసినది…..

ఓ గంట క్రితం చుట్టేసిన దు:ఖం యిప్పుడు శూన్యం

ఈ చిటికెడు విషాదాలు

క్షణకాలప్పాటు మెరిసే ఆనందాలు….. సుఖాలు……

వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు….

అన్నీ… అందరూ కల్సి ఎక్కడికి?

ఎటువేపుకి ప్రస్థానం?

ఒక అనుభూతి నింకో అనుభూతిని కబళిస్తూ….

అంతం లేని దారిలో

అక్కడక్కడా ఆగిపోతూ……చివరికి?

అంతా…..అన్నీ……అందరూ…. ఒకే గాహ్వారంలోకి ……

కాంతిని కూడా స్వాహా చేసే మహా బిలంలోకి….

భావాతిత……అనుభూతి రాహిత్య

మహా శూ……..న్యం………లో……కి

27 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Kasibatla Venugopal

Published Date

Jan, 2022