Description
“బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతో తీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు,జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది. ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది. ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది.”