Additional information
Format | Paperback |
---|
₹70.00
అంతలో ఓ కారు రివ్వున దగ్గరకొచ్చి స్లో అయింది. అందులో నుంచి ఓ రివాల్వర్ బయటకు కనిపించింది. మరుక్షణంలో రెండు గుళ్లు వరుసగా ఆమె పక్క నుంచి దూసుకు పోయాయి.
ఆ యువకుడు సమయానికి ఆమెను పక్కకు లాగబట్టి బ్రతికింది కానీ లేకపోతే రక్తపు మడుగులో కూలి ఉండేది. మరుక్షణంలో ఆమెను వదిలి అటువైపు దూకాడు హరి. కానీ కారు వాయువేగంతో వెళ్లి మిగతా వాహనాల ప్రవాహంలో కలిసిపోయింది. జనమంతా పోగయ్యారక్కడ.
”ఎవరిదా కారు ?”
అతడి తండ్రిని హత్య చేసి తల్లి జైలుకెళ్లింది. తమ్ముడు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలీదు. సమాజం తల్లి మీద కులట, హంతకురాలు అంటూ ముద్రవేసింది…… ఒక వ్యక్తి పన్నాగం పన్ని చేసిన ద్రోహం అది. అతడా వ్యక్తిని ఎదుర్కొవాలనుకున్నాడు. అతడి చేత పాతికేళ్ల కిందటి నిజాల్ని కక్కిద్దామనుకున్నాడు. దానికి ఓ అద్భుతమైన ప్లాను వేశాడు. ఫలితమే….. ఒక రాధ ఇద్దరు కృష్ణులు.
ఊహించలేని మలుపులతో, క్షణక్షణం ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ కూడా – చక్కటి హాస్యంతో గిలిగింతలు పెట్టే యండమూరి వీరేంద్రనాథ్ హ్యూమర్ క్రైమ్ నవల – ఒక రాధ ఇద్దరు కృష్ణులు.