Additional information
select-format | Paperback |
---|---|
book-author | Yaddanapudi Sulochana Rani |
₹75.00
అందరినీ క్రిటి సైజ్ చేస్తానేమో తెలియదు కానీ, నిన్ను అర్ధం చేసుకోవాలని అనుకుంటాను.
డాడి మళ్ళి నవ్విది.
అ నవ్వు డ్రెవర్ కి కూడా చిత్రంగా అనిపించింది. కారు ఆఫీస్ దగ్గర ఆగింది. శివా వచ్చాడు. అతను ముందు డోర్ తెరుస్తుంటే అర్జున్ దాస్ స్వయంగా తనే వెనక డోర్ తెరిచాడు. వెల్ కమ్ మై బాయ్ అన్నారు. శివా క్షణం తటపటా యించాడు. తర్వాత తప్పదన్నట్టుగా వచ్చి వెనుక సీట్లో కూర్చున్నాడు.
ఇదేమిటి కోత్త బట్టలు వేసుకోలేదా ! ఆయన అడిగారు.
ఊహు ! నాకు ఇవే హాయిగా ఉంటాయి. అన్నాడు. ఆ కంఠం సూటిగా సమాధానం చెబుతున్నట్లుగా వుంది.
అతనికి అర్జునదాస్ ఖరీదైన సూటు పంపించారు. శివా వాటిని వేసుకోలేదు. ఫైజమా లాల్చి , భుజాల చుట్టూ షాల్ . ఆ షాల్ ఎక్కడో కల్యాణి కొని యిచ్చిందట. చచ్చినా దాన్ని వదలదు. ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా సే, అది భుజాల చుట్టూ ఉండాల్సిందే.
ఆయన ” బేబి , శివా తో మాట్లాడలేదు ” అన్నారు.
సౌందర్య ఉలిక్కి పడింది.
శివా వైపు తిరిగింది. ఈ రోజు మీ బర్త్ డే కదూ ! మేని హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే. అంది.
అర్జున్ దాస్ గార ఇద్దరి చేతుల మీద చెరో చెయ్యి ఆనిస్తూ, మీరిద్దరూ ఫ్రెండ్స్ గా వుండాలి అని ణా అభిమతం. అన్నారు. ఇద్దరూ నవ్వారు. ఆ నవ్వులో జీవం లేదు. ఇద్దరి మనసులు , వెళుతున్న ఆ కారులోంచి దూకి పారిపోవాలని తహ తహలాడుతున్నాయి.
అంటూ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు తమ నవల ఒంటరి నక్షత్రం.
19 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Yaddanapudi Sulochana Rani |