Additional information
select-format | Paperback |
---|---|
book-author | Ranganayakamma |
₹100.00
రంగనాయకమ్మ గారు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో పల్లవి లేనిపాట! శీర్షికతో ఒక నవలికా ‘కులవిధానం’ గురించీ. ‘దెయ్యాల శాస్త్రం’ గురించీ. ‘మార్క్సిజం’ గురించీ కొన్ని వ్యాసాలూ ఉన్నాయి.
ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు ‘వర్గాలకూ-కులాలకూ’ సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య. ఒకే పరిష్కారం, కాని, చర్చించిన కారణాలు వేరు వేరు.
ఈ పుస్తకంలోనే వున్న ఇతర వ్యాసాలలో కొన్ని, ”దెయ్యాలూ-పరలోకాలూ కూడా సైన్సు విజ్ఞానమే” అని చెప్పే అజ్ఞానశాస్త్రం మీద విమర్శనా వ్యాసాలు.
ఏదైనా ఒక సమస్య మీద వాదోపవాదాలు జరిగితే. అందులో హేతుబద్ధమైన వాదం కనపడితే, మన వాదం తప్పుగా వున్నట్టయితే, మనం మన వాదాన్ని తప్పకుండా మార్చుకోవాలి.
అది ఎదుటి వాళ్ళ కోసం కాదు; మనకోసమే – మన అభివృద్ధి కోసమే.
ఈ పుస్తకంలో వున్న చిట్టచివరి వ్యాసం, మార్క్సిజాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవడానికి అవసరమైనది.
ఆ అవసరం కోసమే చర్చించదగ్గది. ‘పల్లవిలేని పాట’లో రెండు రకాల చర్చలు వున్నాయి. ‘కుల భేదాల’ గురించీ, ‘ప్రేమ సంబంధాల గురించీ’. ఈ చర్చల్ని కూడా పరిశీలించండి!
19 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Ranganayakamma |