Availability: In Stock

Panchukundham RAA!

Author: Krupakar Madiga
SKU: dandora01

200.00

గూడెం గొంతు (లు)

కృపాకర్ మాదిగ ఈ పేరు వినగానే హృదయం పొనుగోటై పులకరిస్తుంది. కొండంత దండోరా ఉద్యమం కళ్ళముందు కదులుతుంది. ఇతడిని చూడగానే గూడెం గూడెమంతా గుండెలకు హత్తుకుంటుంది. “అన్నా! అంటూ ఆత్మీయంగా ఆకాశానికి ఎత్తుకుంటుంది. కృపాకర్ రాజకీయ నాయకుడు కాదు. అట్లా అని పెద్ద సినిమా స్టార్ కాదు. ఏమిటీ కృపాకర్ గొప్పదనం? దేశ వ్యాప్తంగా ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? కృపాకర్ దండోరా ఉద్యమంలో చరిత్ర సృష్టించాడు. గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అత్యంత సంయమనంతో గడ్డుకాలంలో ఎదురొడ్డి నిలబడ్డాడు. వేలాది గ్రామాలను సందర్శించాడు. లక్షలాది కార్యకర్తలను కలిశాడు. వేలాది కిలోమీటర్లు కాలినడకన దశాబ్దాల తరబడి తిరిగాడు. ఏం తిన్నాడో, ఏం తాగాడో తెలియదు గాని అకుంఠిత దీక్షతో అంకితభావంతో వర్గీకరణ సాధించటానికి జీవితాన్నే కాదు, మళ్ళీ రాని యౌవ్వనాన్ని కూడా త్యాగం చేశాడు. మాదిగల కోసం, మాదిగల అనుబంధ కులాల సమాన హక్కుల కోసం, అనుబంధ కులాల ప్రతిఫలాల కోసం ప్రతిక్షణం తపించినవాడు. మానవీయ విలువల కోసం, అట్టడుగువర్గాల కనీస అవసరాల కోసం అధికార గణం మీద అహర్నిశలూ దండోరా వేసిన వాడు. హక్కులు సాధించినవాడు. అంటరాని వారి హక్కులకు భంగం కల్గినప్పుడు, పాలక వ్యవస్థ బాధ్యతలు మరచిపోయినప్పుడు కృపాకర్ కలాన్ని కొరడాలా ఝుళిపించాడు. తన పదునైన వ్యాసాలతో ప్రజల్ని జాగృతం చేశాడు. ఆలోచనాపరుల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే అతను జాతికి జాతీయ నాయకుడయ్యాడు. జాతి రత్నంగా ప్రకాశించగలిగాడు. కృపాకర్ తన ఉద్యమ

పంచుకుందాం రా! .

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Krupakar Madiga