Availability: In Stock
Peddibhotla Subbaramaiah Kathalu 2 – పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు 2
SKU: NAV008-1-1-1-1-2-1-2-1-1-3-1-2-1
₹100.00
గాంధీని చూసినవాడు అనే పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలో బోట్స్వానా నుంచి తాతగారి గ్రామానికి అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ వస్తారు. అది ఎన్నికల సమయం కూడా. ఆ సందర్బంలో వాళ్ళు ఆ గ్రామంలోని ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులకు విస్తుపోతారు. వాళ్ళు ”విన్నదాన్నిబట్టి, చదివినదాన్ని బట్టి ఇక్కడ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్పగా ప్రజాస్వామ్యం ఎన్నికల పద్ధతి అమల్లో ఉంది…. కాని ఆచరణలో జరుగుతున్నదేమిటి?… ఈ దేశం ఎంత గొప్పది…ఇక్కడ ఎన్ని పుణ్యనదులు, ఎన్ని ఎడారులు..ఎంత దాక్షిణ్యం…ఎంత క్రౌర్యం…ఎంత జ్ఞానం… ఎంత అజ్ఞానం… ఎన్ని నీళ్ళు..ఎంత నీళ్ళకరువు..ఎన్ని కులాలెన్ని, మతాలు ఎన్ని, ఎంత ఐశ్వర్యం ఎంత ఆకలి! ఎందరెందరో మఠాధిపతులెన్ని ఆరాధన పద్ధతులు..ఎన్ని భాషలు…ఎంత నిశ్శబ్దం…ఎంత వైవిధ్యం..మళ్ళీ ఎంత ఏకత్వం! ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యమనిపించింది. ఒకప్పటి చప్పన్నారు దేశాలు, మరొకప్పటి అయిదువందల పైచిలుకున్నా పెద్ద రాజ్యాలన్నీ కలిపి అప్పటివారి పుణ్యమా అని ఏకఖంతమై భాసిల్లింది ఈ భూమి!”
ఈ కథలో డ్రాయింగ్ మాస్టారు గొప్ప ఆశావాది. ఆయన అన్నా, చెల్లెళ్ళకు చెప్పింది: ”ఈ దేశం తీరే అంత! ఎంత శాతి ఉందో అంత అశాంతి ఉంది. ఎంత సంతృప్తి ఉందో అంత అసంతృప్తి ఉంది. ఎంత జీవకారుణ్యం ఉందో అంత కర్కశత్వమూ ఉంది. ఎన్ని రంగుల చర్మాలున్నాయో అంత ఐకమత్యమూ ఉంది. ఈ వ్యవస్ధకు యాభైఏళ్ళ వయస్సు వచ్చింది. ఇక ఇప్పుడే ప్రమాదమూరాదు. బాలారిష్టాలన్నీ దాటాయనే అనుకోవచ్చు….